ETV Bharat / city

'సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం'

సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీ కేశినేని నాని తెలిపారు. వారి బలవన్మరణానికి కారణమైన వారిని శిక్షించాలంటూ విజయవాడలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు.

kesineni nani
కేశినేని నాని, ఎంపీ
author img

By

Published : Nov 12, 2020, 8:35 PM IST

అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటనపై కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని తెలిపారు. వైకాపా పాలనలో జరుగుతున్న అక్రమాలన్నింటినీ కేంద్రానికి వివరించనున్నట్లు వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ వారి మీదే దోపిడీలు, దౌర్జన్యాలు ‌చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలంటూ కేశినేని భవన్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవటంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నానితో పాటు తెలుగుదేశం నేతలు నెట్టెం రఘురాం, బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని వారు మండిపడ్డారు.

ఇవీ చదవండి...

కొవిడ్ పరీక్షల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.