ETV Bharat / city

బెజవాడ మేయర్‌ పీఠం: కీలకంగా మారనున్న ఎక్స్​అఫీషియో ఓట్లు..!

విజయవాడ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో తెదేపా ఆరు స్థానాలు కైవసం చేసుకుంటే.. అధికార వైకాపా 2 స్థానాలు సొంతం చేసుకుంది. మేయర్‌ పీఠం కోసం అధికార పార్టీకి ఇంకా 35 స్థానాలు రావాల్సి ఉండగా... తెదేపాకు మరో 31 స్థానాలు వస్తే సరిపోతుంది. ఈ నెల14వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ఇంకా ప్రారంభం కాకుండానే ఏమిటీ ఫలితాలనుకుంటున్నారా..? విజయవాడ మేయర్‌ పీఠం కైవసం చేసుకునేందుకు ఇరు పార్టీలకు కీలకం కానున్న నెంబర్‌ గేమ్‌ ఇదే. రాజకీయ ఆసక్తి రేపుతున్న ఈ అంకెల గారడీ ఏమిటో చూద్దాం.

author img

By

Published : Mar 11, 2021, 7:48 PM IST

బెజవాడ మేయర్‌ పీఠం
బెజవాడ మేయర్‌ పీఠం

హోరాహోరీగా సాగిన విజయవాడ నగరపాలక ఎన్నికల్లో మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు తెదేపా ఖాతాలో ఇప్పటికే ఆరు సీట్లు ఉండగా... అధికార వైకాపా చేతుల్లో రెండు సీట్లు ఉన్నాయి. ఎన్నికలు జరిగిన 64 డివిజన్లకు అదనంగా ఇరు పార్టీలకు ఉన్న 8మంది ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి మొత్తం 72 స్థానాలు పరిగణనలోకి వస్తాయి. వీటిలో మ్యాజిక్‌ ఫిగర్‌ అంటే.. సగానికి ఒకటి ఎక్కవ ఉండాలి. 37 ఓట్లు వచ్చిన వారు మేయర్‌గా విజయం సాధిస్తారు. ఈ నెల 14న ఈ లెక్క తేలనుంది.

ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో 37స్థానాలు ఎవరికి ఉంటే వారు మేయర్ పీఠాన్ని కైవసరం చేసుకోనున్నారు. చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులకు నగరంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఓటు హక్కు ఉంటే వారు ఎక్స్ అఫీషియో కిందకు వస్తారు. స్థానికంగా ఓటుహక్కు ఉన్న ప్రజాప్రతినిధులకు ఆప్షన్ లేకుండానే నేరుగా ఎక్స్ అఫీషియో పరిధిలోకి రానున్నారు. ఎన్నికలు జరిగిన పరిధిలో ఓటుహక్కు లేకుండా ప్రజాప్రతినిధులు జిల్లాకు ప్రాతినిధ్యం వహించే లోక్​సభ సభ్యులు, రెండేసి జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే టీచర్ ఎమ్మెల్సీలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సమయంలోనే తన ఎక్స్అఫీషియో హోదా ఎక్కడ వినియోగించుకోవాలనుకునేది ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

గవర్నర్ కోటా, స్థానిక సంస్థల కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీలకూ ఈ ఆప్షన్ వర్తిస్తుందని నిపుణులు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్థానికంగా ఓటు ఉన్న విజయవాడ ఎంపీ కేశినేనినాని, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ఎమ్మెల్సీలు టీడీ జనార్థన్, అశోక్ బాబు, బుద్ధా వెంకన్న ఓట్లు కలిపి తెదేపా ఖాతాలో ఆరు ఓట్లున్నట్లు లెక్క.

జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఇద్దరు తెదేపాఎమ్మెల్సీలు రాజేంద్ర ప్రసాద్, బచ్చుల అర్జునుడుకు ఉయ్యూరు, మచిలీపట్నంలో ఓటు హక్కుంది. విజయవాడతో పాటు ఆ రెండు చోట్ల పురపోరు జరిగింది. అయితే వీరిద్దరు ఎన్నికలకు ముందే తమ ఆప్షన్​ను స్థానికంగా ఇచ్చేశారు. విజయవాడ ఫలితం ఉత్కంఠ రేపితే వీరిరువురిలో ఆప్షన్ మార్చుకునే అవకాశాలు న్యాయపరంగా సాధ్యాసాధ్యాలను తెదేపా పరిశీలిస్తోంది. ప్రస్తుతం తెదేపా ఖాతాలో స్థిరంగా 6 ఓట్లు ఉన్నందున మరో 31 డివిజన్లలో పార్టీ అభ్యర్థులు గెలుపొందితే బెజవాడ పీఠం తెదేపా వశమవుతుంది.

అధికార వైకాపాకు పశ్చిమ, సెంట్రల్‌ ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఈ పార్టీ అభ్యర్థులు 35 డివిజన్లలో విజయం సాధిస్తేనే మేయర్ పీఠం దక్కనుంది. ఇటీవల ఖరారైన ఎమ్మెల్సీల్లో నగరానికి చెందిన కరీమున్నీసాకు అధికార పార్టీ అవకాశం కల్పించింది. కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీలో దిగిన ఈమెకు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి లభించింది. ఆమె ఎమ్మెల్సీగా ఎంపికైనట్లు ఈ నెల 8వ తేదీనే ఖరారవటంతో ఎక్స్అఫీషియోగా పరిగణనలోకి వస్తారా లేదా అనే తర్జనభర్జన సాగుతోంది. దీనిపైనా స్పష్టత రావాల్సి ఉంది.

నగర ఎన్నికల్లో పోటీచేసిన జనసేనతో పాటు ఇతర పార్టీల అంశమూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలు డివిజన్లలో జనసేన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన 40 డివిజన్లలో పోటీ చేయగా పొత్తు కుదుర్చుకున్న భాజపా 22 డివిజన్లలో పోటీ చేసింది. ఒక డివిజన్‌లో జనసేనకు తెదేపా మద్దతు ఇచ్చింది. జనసేన వివిధ డివిజన్లను గెలిచినా, గెలిచే స్థాయిలో లేకపోయినా ఇరు పార్టీల విజయావకాశాలను తారుమారు చేసే సత్తా ఈ పార్టీకి ఉందనే విషయాన్ని వైకాపా, తెదేపా రెండు అంగీకరిస్తున్నాయి.

వైకాపా అనుకూల ఓట్లు చీల్చటంలో జనసేన ప్రభావం తమకు సానుకూలమని తెదేపా భావిస్తుంటే... సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెదేపా ఓట్లే చీల్చిన ప్రభావం ఇప్పుడూ పునరావృతమవుతుందనే ధీమాతో వైకాపా ఉంది. జనసేన అభ్యర్థులు ఎవరి ఓట్లు చీల్చారనేది నగర రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చితే తెదేపాకు నష్టం జరిగే అవకాశం ఉందని కొంతమంది, గతంలో వైకాపా ఓట్లు జనసేనకు వెళ్లాయని మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. కమ్యూనిస్టులు కూడా కొన్నిచోట్ల ప్రభావం చూపిస్తారని... నాలుగైదు వార్డుల్లో భాజపా ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇక గెలుపు విషయానికొస్తే 40 స్థానాల్లో గెలుపు మాదే అనే ధీమాతో అధికార, ప్రతిపక్ష పార్టీలున్నాయి. కనీసం 10 స్థానాల్లో తమ విజయం తథ్యమని జనసేన ధీమాతో ఉంది. పోలింగ్‌ శాతాన్ని బట్టి తమకే అవకాశం ఉంటుందని చెబుతున్నాయి. తెదేపా, వైకాపాలకు సమానంగా కార్పొరేటర్‌ స్థానాలు వస్తే మేయరు ఎన్నికలో ఎక్స్‌ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. విజయవాడ నగరపాలక సంస్థలో వైకాపా ఇంకా మేయర్‌ అభ్యర్థిని ప్రకటించలేదు. మొత్తం 64 డివిజన్లలో పోటీ చేసింది. తెదేపా సీపీఐతో పొత్తు కుదుర్చుకుని 56 స్థానాల్లో పోటీ చేసింది. ఒక స్థానంలో జనసేన అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఏడు స్థానాల్లో సీపీఐ పోటీ చేసింది.

తెదేపా వర్గాల అంచనా ప్రకారం నగరంలో 35 నుంచి 40 స్థానాల్లో విజయం సాధిస్తామని చెబుతున్నారు. వైకాపా నేతలు తాము 40 నుంచి 45 స్థానాలు గెలుస్తున్నామని ప్రకటించారు. రాజకీయ పార్టీల విశ్లేషకులు మాత్రం తెదేపా గట్టిపోటీ ఇచ్చిందని, సమానంగా విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఎక్స్‌ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయని, ముందు జాగ్రత్తగా నమోదుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏ పార్టీ ఎంత ధీమాగా ఉన్నా గతంతో పోల్చితే అతి తక్కువగా 62 శాతం మాత్రమే పోలింగ్ నమోదవటంతో ఎవరి ఓట్లు ఎటు చీలాయోననే భయం అంతర్గతంగా అన్ని పార్టీల్లోనూ ఉంది. నగరపాలక ఎన్నికల్లో విజయంపై ఎవరి ధీమాలో వారున్నా... ఈ నెల 14వ తేదీన అందరి భవితవ్యం తేలనుంది.

ఇదీ చదవండీ... గుడివాడలో మహా శివరాత్రి వేడుక.. ముఖ్యమంత్రి జగన్ పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.