ETV Bharat / city

'ఎవరితోనూ మహేశ్​కు గొడవల్లేవు.. ఎందుకు చంపారో'

తన కుమారుడిని కాల్చి చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలని.. విజయవాడలో హత్యకు గురైన మహేష్‌ తల్లి విమల డిమాండ్‌ చేశారు. స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లిన మహేష్‌.. శవమై కనిపించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరితోనూ తన కుమారుడికి విభేదాలు లేవన్న మహేష్‌ తల్లితో ముఖాముఖి.

author img

By

Published : Oct 11, 2020, 4:02 PM IST

vijayawada gun fire victim family about mahesh

'ఎవరితోనూ మహేశ్​కు గోడవల్లేవు.. ఎందుకు చంపారో'

కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన మహేష్ హఠాత్తుగా మరణించటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మహేష్ కు ఎవరితో వివాదాలు లేవని.. అందరితో కలిసిపోయే వ్యక్తిని దారుణంగా చంపేశారని అతని తల్లి విమల కన్నీరు మున్నీరవుతోంది.

ఇంతకీ ఏమైందంటే..

విజయవాడ నగర శివారులో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసు కమిషనర్ కార్యాలయంలో మహేశ్ అనే వ్యక్తి పని చేసేవాడు. నున్న అడ్డ రోడ్డు వద్ద స్నేహితులతో కలసి మద్యం సేవిస్తున్న అతని​పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు చేశారు.

వెంటనే అతని పక్కనే ఉన్న స్నేహితులు పారిపోగా... స్థానికంగా ఉన్న వ్యక్తులు మహేష్ ను ఆసుపత్రికి తరలించారు. ఆ లోపే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాల్పులకు కారణం ఏంటనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

విజయవాడ హత్య కేసు ప్రత్యక్ష సాక్షి దినేష్‌ ఏమన్నాడంటే?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.