విజయవాడ దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు అధ్యక్షతన.. ఇంద్రకీలాద్రిపై ఉన్న మల్లిఖార్జున మహామండపంలో పాలకమండలి సభ్యులు సమావేశమయ్యారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ఆలయానికి వచ్చే భక్తుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.
ఈ ఏడాది ఆర్దిక బడ్జెట్ రూపకల్పనతోపాటు ఇతర అంశాలను అజెండాలో పొందుపరిచారు. గతేడాది కొవిడ్ పరిస్థితుల కారణంగా బడ్జెట్‌పై ఎలాంటి చర్చ లేకుండానే.. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు అత్యవసర బడ్జెట్ కింద ఖర్చు పెట్టారు. కరోనా పరిస్థితుల్లో దేవస్థానానికి ఆదాయం లేకపోగా ఖర్చు గణనీయంగా పెరిగింది. సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ల విషయంతోపాటు భద్రతా ప్రమాణాల దృష్ట్యా.. ఎక్కువ మొత్తం ఖర్చు చేసింది.
ఈ సంవత్సరం దేవస్థానం సుమారు రూ.122 కోట్లతో బడ్జెట్ రూపొందించి. రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం అభివృద్ధికి.. రూ. 70 కోట్ల కేటాయింపుతో కలిపి మొత్తం బడ్జెట్ రూ.192 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
ఇదీ చదవండి: