విజయవాడ దుర్గ అగ్రహారంలో ఈనెల 25న ఆలమూరు రాములు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించామని చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
పథకం ప్రకారమే రాములును హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉదయం నుంచి అతణ్ని అనుసరించి దాడి చేసినట్లు భావించారు. కుట్రలో భాగంగానే రాములును అగ్రహారానికి రప్పించి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఒక యువతి ప్రేమ వివాహం విషయమై రాములుకు, నిందితులకు మధ్య వివాదం తలెత్తిందని... అదే హత్యకు దారి తీసిందని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
రాములు హత్యకేసులో రౌటీషటర్ కుక్కల రవి, శ్యామ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని... మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: MURDER: విజయవాడ దుర్గ అగ్రహారంలో దారుణం.. నడిరోడ్డుపై వ్యక్తి హత్య