కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా నిత్యం 18 గంటల కర్ఫ్యూ విధించినట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగులు ఐడీ కార్డు చూపించాలని పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలో వ్యాపార సంస్థలు, కార్యాలయాలు మూసివేయాలని సీపీ శ్రీనివాసులు తెలిపారు. 20 మందికి మించి అతిథులతో వివాహాలు జరపవద్దని సీపీ స్పష్టం చేశారు.
ఇక.. కర్ఫ్యూ ఆంక్షల ప్రభావంతో విజయవాడలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ప్రజా రవాణాతో పాటు ప్రైవేటు వాహనాలను సైతం నిలిపివేశారు. అత్యవసర సర్వీసులతో పాటు టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నారు. అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్నవారు తప్ప... మిగతా వ్యక్తులెవరూ కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీల్లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
కర్ఫ్యూ ప్రారంభం : రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఆంక్షలు