విజయవాడ నేతాజీ బ్రిడ్జ్ వద్ద చలివేంద్రాన్ని సీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. వలస కూలీలకు ఓఆర్ఎస్, మజ్జిగ, మాస్క్,పాదరక్షలను అందచేశారు. సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. నగరంలో పలు చోట్ల ఇటువంటి చలివేంద్రాలను ఏర్పాటుచేసి వలస కూలీలకు సహాయం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇతర శాఖల అధికారులు వలస కూలీలకు రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి వారికి భోజన వసతి కల్పిస్తున్నారని తెలిపారు. వీరందరిని శ్రామిక రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరుస్తున్నామని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి