విజయవాడ నగరంలో ఇప్పటి వరకు 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వివిధ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి తిరిగి సర్వే చేపడుతున్న బృందాలు... ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తున్నారు. నగరంలో ప్రస్తుత పరిస్థితులు అదుపులో ఉన్నాయంటున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇవీ చదవండి: డోపింగ్ కారణంగా భారత అథ్లెట్‌పై నాలుగేళ్ల నిషేధం