Car havoc in Vijayawada: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత రాజరాజేశ్వరిపేట సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి.. రోడ్డు పక్కన ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. సంఘటన సమయంలో కారు వేగం అదుపు చేయలేక.. రోడ్డు పక్కనే ఉన్న గోడని ఢీకొట్టి ఆగింది. ప్రమాదంలో షకీల్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జీజీహెచ్‌కి తరలించారు. కారు నడిపిన వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి