![పురాతన విగ్రహాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8989362_bapu3-2.jpg)
విజయవాడ బాపు మ్యూజియాన్ని అక్టోబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి లాంఛనంగా పున: ప్రారంభించనున్నారు. బందరు రోడ్డులోని ఈ మ్యూజియాన్ని ఎనిమిది కోట్ల రూపాయలతో ఆధునికీకరించారు. అత్యాధునిక సాంకేతికతతో మ్యూజియాన్ని అభివృద్ధి చేశామని, కొత్తగా నిర్మించిన భవనంలో ఆదిమ యుగం నుంచి ఆధునిక యుగం వరకు 1500 వస్తువులను ప్రదర్శనలో ఉంచినట్లు పురావస్తుశాఖ కమిషనర్ జి.వాణిమోహన్ తెలిపారు.
![బాపు మ్యూజియంలోని పురాతన విగ్రహాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8989362_bapu1.jpg)
దేశంలోని ఏ మ్యూజియంలో లేని విధంగా స్మార్ట్ఫోన్లోని యాప్ ద్వారా ప్రదర్శిత వస్తువుల చరిత్ర తెలుసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. మ్యూజియం పున:ప్రారంభోత్సవ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు సమీక్ష జరిపారు.
![బాపు మ్యూజియంలోని పురాతన వస్తువులు, విగ్రహాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8989362_bappu4.jpg)
ఇదీ చదవండి : 'ప్రతి రోజూ పదివేల మంది భక్తులకు అనుమతి'