ఎంతసేపూ ఐటీ దాడుల గురించే మాట్లాడుతున్న వైకాపా నేతలు... 3 ఇన్ఫ్రా సంస్థలపై ఎందుకు మాట్లాడడం లేదని.. మాజీమంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై మంత్రులు రోజుకోమాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు తీసుకునే నిర్ణయాలు చెల్లవని స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలోని వెంకోజీపాలెంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంపై విజయసాయిరెడ్డి కన్నుపడిందని దేవినేని ఆరోపించారు. ఆశ్రమానికి చెందిన 6.5 ఎకరాల భూమి స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని రైతులపై అక్రమ కేసులు పెట్టొద్దని హైకోర్టు మొట్టికాయలు వేసినా... జై అమరావతి అన్నవారిపై దౌర్జన్యం చేస్తున్నారని ఆక్షేపించారు.
ఇదీచదవండి