ETV Bharat / city

ఆస్పత్రుల్లో విజిలెన్స్ అధికారుల తనీఖీలు.. 9 ఆస్పత్రులపై కేసులు నమోదు - ఆస్పత్రుల్లో తనీఖీలు చేపట్టిన విజిలెన్స్ అధికారులు తాజా వార్తలు

కరోనా చికిత్సలో భాగంగా పలు ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు 15 ఆస్పత్రులను తనీఖీలు చేశారు. ఇందులో భాగంగా.. 9 ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధరించి సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టర్ జనరల్ కె.వి.రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు.

Vigilance Rides on Hospitals Over Corona Treatment
ఆస్పత్రుల్లో తనీఖీలు చేపట్టిన విజిలెన్స్ అధికారులు
author img

By

Published : Jun 20, 2021, 10:51 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల్లో మొత్తం 15 ఆస్పత్రులను తనిఖీ చేసి.. 9 ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధరించి సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టర్ జనరల్ కె.వి.రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. కొవిడ్ చికిత్సలో అవకతవకలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై.. ఏర్పాటు చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు మంగళ, బుధవారాల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా.. ఇప్పటివరకు మొత్తం 37 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.

ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ధేశించిన రేట్ల కంటే అధిక మొత్తం వసూలు చేయడం వంటివి తమ దృష్టికి వచ్చాయన్నారు. రెమిడిసివిర్ ఇంజక్షన్లు దుర్వినియోగం చేయడం, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మడం, ప్రభుత్వం అనుమతి లేకుండా కరోనా చికిత్స నిర్వహించడం, ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులైన రోగులకు కరోనా చికిత్సను తిరస్కరిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించడం జరిగిందన్నారు.

పశ్చిమగోదావరిలో
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉన్న చైత్ర హాస్పిటల్.. అధిక ఛార్జీలు వసూలు చేయడంతో పాటు పేషెంట్లు వారికి సంబంధించిన చికిత్సపై తప్పుడు సమాచారం అందించినట్లు గుర్తించామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 188, 420 తో పాటు.. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్​లోని సెక్షన్ 53 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టర్ జనరల్ కె.వి.రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు.

అనంతపురంలో
అనంతపురంలోని ఆశా హాస్పిటల్​లో.. ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయడం గుర్తించామన్నారు. ఐపీసీ సెక్షన్ 188, 420, 406తో పాటు డిజాస్టర్ మేనేజ్​మెంట్ యాక్డులోని సెక్షన్లు 51(ఏ), 53 కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

విశాఖలో
విశాఖపట్నం జిల్లా గోపాలపట్టణం ఎస్ఆర్ ఆస్పత్రి, అనిల్ నీరుకొండ ఆస్పత్రి, రమ్య ఆసుపత్రిలో.. ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయడం, రెమిడిసివిర్ ఇంజక్షన్లను దుర్వినియోగం చేయడం గుర్తించామన్నారు. ఆస్పత్రిపై.. ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

విజయవాడలో
విజయవాడలోని అచ్యుత ఎన్​క్లేవ్, శ్రీరామ్​ ఆస్పత్రి​లో.. అనుమతి లేకుండా ప్రైవేట్ ప్రాంగణంలో కరోనా చికిత్సలు అందిస్తున్నట్లు గుర్తించి.. కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

గుంటూరులో
గుంటూరులోని విశ్వాస్ ఆస్పత్రిలో.. ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయడం, ఆరోగ్యశ్రీ కింద చికిత్సలను తిరస్కరిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.

చిత్తూరులో..
చిత్తూరు జిల్లా పీలేరులోని డాక్టర్ ప్రసాద్ హాస్పిటల్ నందు ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించి 188, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.

ఇదీ చదవండి:

APSRTC: రేపట్నుంచి తెలంగాణకు బస్సులు నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.