జస్టిస్ ధర్మాధికారి తీర్పు ప్రకారం.. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలో చేరడానికి తెలంగాణ నుంచి వచ్చిన 650 మంది విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఉద్యోగులను చేర్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖంగా లేదు. వారిని తీసుకోవడానికి పోస్టులు లేవంటూ నిరాకరించింది. ఈ మేరకు విద్యుత్ సౌధ ఉన్నతాధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి..