ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Vice President Venkaiah Naidu) గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం(gannavaram international airport) చేరుకున్నారు. వెంకయ్య నాయుడుకి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కలెక్టర్ నివాస్, సీపీ బత్తిన శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు, భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం రోడ్డు మార్గంలో ఉంగుటూరు మండలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ కు ఉపరాష్ట్రపతి బయలుదేరారు. విమానాశ్రయం, చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై భద్రతా ఏర్పాట్లను డీసీపీ హర్షవర్ధన్ రాజు సహా తదితరులు పర్యవేక్షించారు.
ఇదీ చదవండి:
BADVEL BYPOLL: ప్రశాంతంగా ఉప ఎన్నిక.. 11గంటల వరకు 20.89 శాతం పోలింగ్