విజయవాడలోని రామ్మోహన్ గ్రంథాలయాన్ని(rammohan library in vijayawada) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(wise president venkaiah naidu) సందర్శించారు. ఉపరాష్ట్రపతికి కలెక్టర్ నివాస్(collector nivas), సీపీ శ్రీనివాసులు(CP srinivasulu) ఘన స్వాగతం పలికారు. గ్రంథాలయ నిర్వాహకులను ఉపరాష్ట్రపతి ఆత్మీయంగా పలకరించారు. రాష్ట్రంలోనే విశేష చరిత్ర గల రామ్మోహన్ గ్రంథాలయాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు.
'ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం' అనేది నినాదంగా కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ(mahathma gandhi) మూడుసార్లు గ్రంథాలయాన్ని సందర్శించారని వివరించారు. చారిత్రక ప్రదేశాలను యువత సందర్శించాలని సూచించారు. స్వచ్ఛభారత్ మాదిరిగా గ్రంథపఠనం(book reading) ప్రజాఉద్యమ రూపు దాల్చాలని అన్నారు. ఇంటర్నెట్(internet), టీవీ సంస్కృతి(TV culture) వల్ల ఎదురయ్యే సమస్యలకు పుస్తక పఠనం పరిష్కారం అవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పుస్తక పఠనాన్ని ఆటపాటల్లా అలవాటు చేయాలని కోరారు.
ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలి. మహాత్మాగాంధీ మూడుసార్లు గ్రంథాలయాన్ని సందర్శించారు. చారిత్రక ప్రదేశాలను యువత సందర్శించాలి. స్వచ్ఛభారత్ మాదిరిగా గ్రంథపఠనం ప్రజాఉద్యమ రూపు దాల్చాలి. ఇంటర్నెట్, టీవీ సంస్కృతి వల్ల ఎదురయ్యే సమస్యలకు పుస్తక పఠనం పరిష్కారం కావాలి. విద్యార్థులకు పుస్తక పఠనాన్ని ఆటపాటల్లా అలవాటు చేయాలి.
- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
యువతకు సర్దార్ పటేల్ మార్గదర్శి...
స్వర్ణ భారత్ ట్రస్టు(swarna bharath trust)లో జరిగిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో(sardhar vallabhbhaipatel birth anniversary) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందే విద్యార్థులతో మాట్లాడారు. దేశ ప్రగతిలో పటేల్ సేవలు మరువలేనివని ఉపరాష్ట్రపతి అన్నారు. యువతకు సర్దార్ పటేల్ మార్గదర్శి అని కొనియాడారు.
ఉపరాష్ట్రపతిని కలిసిన మంగళగిరి ఎయిమ్స్ బృందం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మంగళగిరి ఎయిమ్స్(mangalagiri aims) బృందం కలిసింది. అభివృద్ధి కార్యక్రమాలను బృందం సభ్యులు ఉపరాష్ట్రపతికి వివరించారు. సమస్యలు ప్రస్తావించారు. వారి సమస్యలపై స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎయిమ్స్ పనులను వేగవంతం చేయడానికి చొరవ తీసుకోవాలని సూచించారు.
ఇవీచదవండి.