ETV Bharat / city

నేడు ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు నేడు హైదరాబాద్‌లోని మౌలాలిలో జరగనున్నాయి.

నేడు ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు
author img

By

Published : Sep 26, 2019, 6:05 AM IST

అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు నేడు హైదరాబాద్‌లోని మౌలాలిలో జరగనున్నాయి. మధ్యాహ్నం తర్వాత వేణు అంతిమ సంస్కారాలు జరిపేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉదయం వేణు భౌతికకాయాన్ని మౌలాలిలోని నివాసం నుంచి అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్‌కు తరలించనున్నారు. అక్కడ నటీనటుల సంఘం వేణు మాధవ్‌కు కడపటి నివాళులు అర్పించనుంది. అనంతరం.. వేణు అంతిమయాత్ర మౌలాలికి చేరుకుంటుంది. అక్కడి శ్మశాన వాటికలో కుటుంబసభ్యులు దహన సంస్కారాలు జరిపించనున్నారు.

Intro:444

Body:888

Conclusion:ఎన్ని ప్రభుత్వాలు మారినా సోమశిల ముంపు బాధితుల తలరాతలు మాత్రం మారడం లేదు .పరిహారం పూర్తిస్థాయిలో అందక జీవచ్ఛవాలుగా బతుకులు వెళ్లదీస్తున్నారు. వారి కష్టాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

ఇది కడప జిల్లా సోమశిల ముంపు గ్రామమైన బొడ్డు చర్ల గ్రామం. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నిర్మాణం కారణంగా నిరాశ్రయులయ్యారు. జీవనానికి ఆధారంగా ఉన్న భూములను ఇళ్లను కోల్పోయారు. గ్రామంలో రహదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. నడవడానికి కూడా శక్యం కావడం లేదు. తాగునీటికి సంబంధించిన ఊరంతటికీ ఒకే బోరు. చెడిపోతే వీరి బాధలు అన్నీ ఇన్నీ కావు. పక్క గ్రామానికి వెళ్లి మీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి. పాఠశాలలో విద్యార్థులు చదువులు సాగించాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. భర్త గుండెపోటుతో మృతి చెందగా జీవనానికి ఆధారంగా ఉన్న గేదెలు నీటమునిగి బతుకు భారంగా మారిందని నాగమ్మ చెబుతోంది.

బైట్
నాగమ్మ , ముంపు బాధితురాలు, బొడ్డే చర్ల .

ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం అందించి ముంపు బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది .

గోవింద రావు ,ఈటీవీ భారత్, బద్వేలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.