ETV Bharat / city

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై వసంత శోభ.. నవరాత్రుల్లో రోజుకో పుష్పాలంకరణ - indrakeeladri

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం.. ఏప్రిల్‌ రెండో తేదీ నుంచి వసంతోత్సవ శోభతో అలరారనుంది. చైత్ర మాసం కావడంతో రెండో తేదీ నుంచి 10తేదీ వరకు వసంత నవరాత్రులు.. 12 నుంచి 20వ తేదీ వరకు చైత్ర మాస బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.

vasantha navaratrulu at vijayawada indrakeeladri temple
ఇంద్రకీలాద్రిపై వసంత శోభ
author img

By

Published : Apr 1, 2022, 10:19 AM IST

Updated : Apr 1, 2022, 11:53 AM IST

ఇంద్రకీలాద్రిపై వసంత శోభ

Indrakeeladri: రేపటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రులు జరగనున్నాయి. చైత్ర మాసం కావడంతో రెండో తేదీ నుంచి 10తేదీ వరకు వసంత నవరాత్రులు.. 12 నుంచి 20వ తేదీ వరకు చైత్ర మాస బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుష్పాలతో దుర్గామల్లేశ్వర స్వామి, దేవి వారిని అలంకరించి విశేషంగా పూజిస్తారు. గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్లకు స్నపనాభిషేకాలు, అలంకారం, అర్చన, నివేదన, హారతి వంటి కార్యక్రమాలను నిర్వహించి ఉదయం 8 గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. కలశ స్థాపనతో ప్రారంభమైన ఉత్సవంలో.. పుష్పార్చన, అగ్ని ప్రతిష్టాపన, మండప పూజ, రుద్ర హోమంతో పాటు.. ఉత్సవమూర్తులకు వెండి రథంపై అర్చకులు ఊరేగింపు చేయనున్నారు. ఒక్కొక్క రోజూ ఒక్కొక్క పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన స్వామి వసంత నవరాత్రోత్సవాలు.. పూర్ణాహుతి కార్యక్రమంతో ముగియనున్నాయి.

ఇదీ చదవండి:

Tirumala: ఆర్జితసేవా టికెట్లకు విశేష స్పందన

Last Updated : Apr 1, 2022, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.