బ్యాంకుల ముందు చెత్త ఘటనపై కేంద్రం కన్నెర్ర చేయటంతో జగన్ ప్రభుత్వం తోకముడిచిందని.. తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. బ్యాంకుల ముందు చెత్తవేసి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించటం క్షమించరాని నేరమన్నారు. ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ఎస్సీ కాబట్టే ఈ వ్యవహారంలో ఆయనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. మిగతా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో.. ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎస్సీ వర్గానికి చెందిన కమిషనర్ ప్రకాశ్ రావును మాత్రమే సస్పెండ్ చేశారన్నారు.
ఇదీచదవండి
'చెత్త'ఘటనపై ప్రభుత్వం చర్యలు..మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు