గుంటూరు జిల్లా మందడంలోని పోరంబోకు భూమి ఆక్రమణకు గురైందని సీఆర్డీఏ కమిషనర్‌కు తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఏపీ సచివాలయానికి అతి సమీపంలో ఎప్పటినుంచో ఆ భూమి ఉందని వర్ల లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ స్థలాన్ని ఎంపీ, అతని అనుచరులు ఆక్రమించడంపై మండిపడ్డారు. స్థానిక పోలీసులకు ఈ వ్యవహారం తెలిసినా.. అధికార పార్టీ నేతల హస్తం ఉండటంతో ఏమీ మాట్లాడటం లేదని వర్ల ఆరోపించారు. పోరంబోకు స్థలాన్ని ఆక్రమించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వర్ల డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'విశాఖ పర్యటనకు చంద్రబాబు దరఖాస్తు చేస్తే అనుమతి ఇస్తాం'