సీఎం జగన్ తాను 16నెలలు జైలు శిక్ష అనుభవించిన కోపంతో ప్రజలు, తెదేపా నాయకులపై ఇనుప పాదం మోపుతున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. దళితులంటే ఎందుకంత ద్వేషమో అర్థం కావట్లేదన్నారు. పైనుంచి ఆదేశాలు లేకుండా కానిస్టేబుళ్లు రైతులకు బేడీలు వేయరన్న వర్ల.. ఘటనకు ప్రేరేపించినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతుల బెయిల్ పిటిషన్పై జరిగే వాదనలను అడ్డుకోకూడదని వర్ల రామయ్య హితవు పలికారు.
ఇదీ చదవండి: అమరావతి ఐకాస జైల్ భరో...అడ్డుకుంటున్న పోలీసులు