రాచరికపోకడలతో వైకాపా ప్రభుత్వం పాలన సాగించటం దుర్మార్గమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలపై వార్తలు రాస్తే జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన మైరా రవి బంధువులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకంగా వార్తలు రాసిన పాత్రికేయులపై ఉక్కుపాదం మోపుతారా అని ప్రశ్నించారు. ఫోర్త్ ఎస్టేట్ ప్రాధాన్యతను వైకాపా సర్కారు తెలుసుకోవాలని హితవు పలికారు. జీవో 2430 ద్వారా పత్రికా స్వేచ్చను ప్రభుత్వం హరిస్తోందని దుయ్యబట్టారు. కోర్టు ధిక్కార చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.