Vangalapudi Anitha: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత జాతీయ మహిళా, మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. ఇటీవల మచిలీపట్నంలో యువతిపై కొందరు దాడి చేశారని.. బాధితురాలు దిశా పీఎస్‌ను ఆశ్రయించినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. నెల్లూరు ఘటన మరువకముందే మరో ఘటన జరగడం దారుణమన్నారు. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని.. ఘటనలన్నింటినీ పరిగణలోకి తీసుకుని విచారణ జరిపించాలని కోరారు.
ఇదీ చదవండి:
' అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెప్పినా.. ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేశారు '