అబ్కారీ శాఖ పరంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాయని ఉత్తరప్రదేశ్ ఎక్సైజ్ కమిషనర్ పి. గురుప్రసాద్ అన్నారు. మద్యం సరఫరా, విక్రయాలకు సంబంధించి లోపాలకు అస్కారం లేని విధంగా ఏపీలో స్పష్టమైన వ్యవస్ధలను నెలకొల్పారని అభినందించారు. విజయవాడ ప్రసాదంపాడులోని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనరేట్‌ను ఆయన సందర్శించారు. రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా- ఇతర అధికారులతో గురుప్రసాద్ భేటీ అయ్యారు.
ఇరు రాష్ట్రాల మధ్య సారుప్యత ఉన్న అంశాలు, ఇక్కడ అమలవుతున్న విధానాల గురించి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న హెచ్‌పీఎఫ్ఎస్ తీరు గురించి యూపీ బృందానికి వివరించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నందున వల్ల లోప రహితంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్క మద్యం సీస ఎక్కడ ఉందో కేంద్రకార్యాలయం నుంచే తెలుసుకోగలుగుతామని.. దీనివల్ల క్షేత్ర స్దాయిలో అవినీతికి అస్కారం లేకుండా చేయగలుగుతున్నామని మీనా పేర్కొన్నారు.
ఇవీ చూడండి-గ్రామీణ బ్యాంకు రంగంలో మొదటిస్థానమే లక్ష్యం!