paritala road accident:కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పిన ఓ కారు ద్విచక్రవాహనంపైకి దూసుకెళ్లింది. బైకుపై వెళ్తున్న బాలుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మిస్టర్ కర్ణాటక బాడీ బిల్డర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. మృతులు కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామానికి చెందిన కృష్ణ పద్మారావుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: Fire Accident: ఒంగోలు ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం... 8 ప్రైవేటు బస్సులు దగ్ధం