ETV Bharat / city

"అమ్మా.. నీ దగ్గరికే వచ్చేస్తామమ్మా.." ఇద్దరు కొడుకుల దారుణ నిర్ణయం..! - బలవన్మరణం

తల్లి ప్రేమ కోల్పోయామని.. మనోవేదనతో ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన.. తెలంగాణలోని మేడ్చల్​-మల్కజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయరలో బుధవారం జరిగింది. ఒకరు ఉరివేసుకోగా.. ఒకరు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

two brothers end life due to their dead mother
తల్లి ప్రేమ కోల్పోయామని.. అన్నదమ్ముల బలవన్మరణం
author img

By

Published : Jun 23, 2022, 8:02 AM IST

తల్లి ప్రేమ కోల్పోయామని.. మనోవేదనతో ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన.. తెలంగాణలోని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయరలో బుధవారం జరిగింది. తల్లి ప్రమీల అనారోగ్యంతో మృతి చెందడంతో కొడుకులు ఇద్దరూ తట్టుకోలేకపోయారు. సూసైడ్ నోట్ రాసి యాదిరెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. తమ్ముడు మహిపాల్ రెడ్డి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు!

స్థానికుల కథనం ప్రకారం.. రాంపల్లిదాయరకు చెందిన మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, ప్రమీలకు.. మాధవరెడ్డి, యాదిరెడ్డి(32), మహిపాల్‌రెడ్డి(29) అనే ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. అయితే.. శ్రీనివాస్‌రెడ్డి తన భార్య, పిల్లలను వదిలేసి మరో వివాహం చేసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కూతురు కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి ప్రమీల ఒంటరిగా ఇంట్లో ఉంటోంది. ముగ్గురు కొడుకులూ నగరంలో స్థిరపడ్డారు. పెద్ద కొడుకు మాధవరెడ్డి నగరంలోని గండిపేటలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నారు. యాదిరెడ్డి, మహిపాల్‌రెడ్డి దిల్‌సుఖ్‌నగర్‌లో అద్దెకుంటూ మ్యూజిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పని చేస్తున్నారు. హార్మోనియంపై శిక్షణ ఇస్తూ నెలకు ఒక్కొక్కరు రూ.30 వేల వరకు సంపాదిస్తున్నారు. వారానికోసారి తల్లి వద్దకు వచ్చి వెళ్లేవారు.

కాగా ప్రమీల ఎనిమిది నెలల క్రితం క్యాన్సర్‌తో మృతిచెందారు. అంత్యక్రియల తర్వాత ముగ్గురు సోదరులూ తాము పనిచేసే ప్రాంతాలకు వెళ్లి పోయారు. ఈనెల 21న యాదిరెడ్డి, మహిపాల్‌రెడ్డి ఇంటిని శుభ్రం చేసేందుకు గ్రామానికొచ్చారు. బుధవారం ఉదయం నుంచి గండిపేటలో ఉన్న మాధవరెడ్డి తన సోదరులకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తలేదు. అనుమానం వచ్చి పక్కింటి వారికి ఫోన్‌ చేసి చెప్పారు. సాయంత్రం పక్కింటి వారు వెళ్లి కిటికీలోంచి చూడగా యాదిరెడ్డి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని, మహిపాల్‌రెడ్డి పురుగుల మందు తాగి చనిపోయి ఉన్నట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మాధవరెడ్డికి విషయం తెలిపారు.

ఇంట్లో మృతులు రాసిన సూసైడ్‌ నోట్‌ పోలీసులకు దొరికింది. అందులో "మా అమ్మ ప్రేమ లేదు అని బాధ పడి చనిపోతున్నాము. మా మరణానికి ఎవరూ కారకులు కాదని తెలియజేస్తున్నాము. ఇట్లు యాదిరెడ్డి మహిపాల్‌రెడ్డి" అని రాసి ఉంది. పోలీసులు మరణ వాంగ్ముల పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.