వైకాపా ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ సరఫరాను ఎత్తివేసినా సరే... తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మీటర్లు తొలగిస్తామని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని స్పష్టం చేశారు. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం ఉచిత విద్యుత్నేపై చేశారని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని విపక్షాలు విమర్శలు చేసినా... వైఎస్ మాత్రం తన మాట నిలబెట్టుకుని విమర్శలకు సమాధానం చెప్పారన్నారు.
వైఎస్ వర్థంతి రోజే ఉచిత విద్యుత్ పథకానికి చరమగీతం పాడేలా ప్రభుత్వం జీవో నెం 22ను తీసుకువచ్చిందని మండిపడ్డారు. రైతు ఏడ్చిన రాజ్యం – ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవన్నారు తులసిరెడ్డి. రైతులను ఏడిపించే జీవో 22ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గండికోట ముంపు గ్రామాల ప్రజలకు ముందు పరిహారం చెల్లించి, పునారావాసం కల్పించాలని ఆ తర్వాతే వారిని ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలకు ఈ మాత్రం అవగాహన లేకపోవడం దురదృష్టకరమని తులసిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: