ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ టీచర్స్ ఆసోసియేషన్ విజయవాడలో రాష్ట్రస్థాయిలో సమావేశం నిర్వహించింది. గత ఏడాది మార్చ్ నెల నుంచి నేటి వరకు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోయారు. కరోనా ప్రభావంతో ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే.. ఉన్న ఉద్యోగాల్లో నుంచి 6 వందల మంది వొకేషనల్ శిక్షకులను తొలగించారని ఆవేదన చెందారు.
2016 నుంచి వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న తమను కొనసాగిస్తూ... ఒకేషనల్ ఉపాధ్యాయులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో చదువుతో పాటు నైపుణ్యం ఉండలాంటే ఒకేషనల్ ఉపాధ్యాయులను కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. తమ సమస్యనను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం ఇస్తామని.. స్పందించకుంటే రాష్ట్రస్థాయి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్‌పై.. ఈ నెల 22న సీబీఐ కోర్టు విచారణ!