ETV Bharat / city

Sexual Harassment Case: ట్రైనీ ఐఏఎస్​పై లైంగిక దాడి కేసు - Ex mla madanlal news

ఓ ట్రైనీ ఐఏఎస్​పై (Trainee IAS sexual harassment case) హైదరాబాద్​ కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. నిందితుడు పెళ్లి‌ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది.

Trainee IAS Sexual Harassment Case: ట్రైనీ ఐఏఎస్​పై లైంగిక దాడి కేసు

author img

By

Published : Oct 21, 2021, 9:29 PM IST

ట్రైనీ ఐఏఎస్ బానోత్‌ మృగేందర్‌లాల్‌పై (Trainee IAS sexual harassment case) హెదరాబాద్​లోని కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. మృగేందర్‌లాల్‌ పెళ్లి‌ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు ట్రైనీ ఐఏఎస్‌ మృగేందర్‌లాల్‌పై కేసు చేశారు. మృగేందర్‌లాల్‌.. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కుమారుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం మధురైలో ట్రైనీ ఐఏఎస్‌గా బానోత్‌ మృగేందర్‌లాల్ (Trainee IAS sexual harassment case) ఉన్నారు. ఫేస్‌బుక్‌లో మృగేందర్‌లాల్‌తో పరిచయం ఏర్పడిందన్న యువతి... ప్రేమ పేరుతో తనకు దగ్గరయ్యాడని తెలిపింది. మృగేందర్‌లాల్‌ తనపై లైంగికదాడి చేశాడని యువతి ఫిర్యాదు చేసింది.

పెళ్లికి మృగేందర్‌లాల్‌ నిరాకరిస్తున్నాడని పేర్కొంది. మృగేందర్‌ తండ్రి, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ తనను బెదిరిస్తున్నారని యువతి ఫిర్యాదులో వెల్లడించింది. కుమారుడిని వదిలేయాలని బెదిరిస్తున్నారని ఆరోపించింది. మదన్‌లాల్‌ డబ్బు ఆశ చూపారని ఫిర్యాదులో పేర్కొన్న యువతి... రూ.25 లక్షలు తీసుకొని వదిలేయాలంటూ బెదిరించారని వాపోయింది.

ఇదీ చదవండి: MURDERS: కడపలో ఘోరం.. తల్లీకూతుళ్లను బలిగొన్న క్షణికావేశం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.