- Godavari Kaveri link project: గోదావరి-కావేరి అనుసంధానంపై అన్నిరాష్ట్రాలు సూత్రప్రాయ ఆమోదం
గోదావరి - కావేరి అనుసంధానం ప్రాజెక్టుపై 5 రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశమైంది. దిల్లీలోని జలశక్తిశాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్లో సమావేశం జరిగింది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సమావేశానికి జలశక్తి శాఖ, ఎన్‌డబ్ల్యూడీఏ, 5 రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు.
- ఆయనది హోల్‌సేల్ దోపిడీ అయితే.. వారిది చిల్లర దోపిడీ: చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్ హోల్‌సేల్‌గా రాష్ట్రాన్ని దోచుకుంటే.. మిగిలిన అధికార పార్టీ నేతలు చిల్లర దోపిడీలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. వాలంటీర్ల కోసం ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని మండిపడ్డారు. రూ.26 వేల కోట్ల నరేగా నిధులు వచ్చినా.. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సర్పంచ్‌లకు చంద్రబాబు సూచించారు.
- Road Accident at chittor: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ముందువెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుఅయ్యింది. ఈ దుర్ఘటనలో.. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఓ రెండేళ్ల పాప కూడా ఉంది. చనిపోయిన నలుగురినీ విశాఖ వాసులుగా గుర్తించారు.
- Relaxation of covid-19 restruction: సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేత.. ప్రభుత్వం ఉత్తర్వులు
సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల కార్యదర్శులు సచివాలయానికి రావాలని ఆదేశించింది.
- హిజాబ్ ఇష్యూలో విద్యార్థులపై తొలికేసు- లెక్చరర్ రాజీనామా
కర్ణాటకలో హిజాబ్ వివాదం అంతకంతకూ ముదురుతోంది. తుమకూరులో తొలిసారి విద్యార్థులపై కేసు నమోదైంది. నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. హిజాబ్ ధరించొద్దన్నందుకు ఓ కళాశాలలో మూడేళ్లుగా పని చేస్తున్న ఆంగ్ల అధ్యాపకురాలు రాజీనామా చేశారు.
- 'బుల్డోజర్లు రిపేర్‌లో ఉన్నాయ్.. ఫలితాల తర్వాత వారి పని పడతాయ్!'
నేరస్థులపై తమ ప్రభుత్వ వైఖరిని గుర్తుచేస్తూ బుల్డోజర్ల గురించి మాట్లాడారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ప్రస్తుతం వాటన్నింటినీ రిపేరుకు పంపించామని, మార్చి 10 తర్వాత వారి పని పడతాయని వ్యాఖ్యానించారు.
- యుద్ధం వస్తే భారత్‌కు తిప్పలే!- వాటిపై తీవ్ర ప్రభావం..
ఉక్రెయిన్- రష్యా వివాదం మరింత తీవ్రమైతే ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల ప్రభావం పడనుంది. ఇప్పటికే కరోనావైరస్ కారణంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు చాలా దెబ్బతిన్నాయి. తాజాగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి తెరలేచి.. మిగిలిన ప్రపంచ శక్తులు దానిలోకి అడుగుపెడితే భారత్‌పై అది పెనుప్రభావం చూపించనుంది. ముఖ్యంగా చమురు ధరలు, ద్రవ్యోల్బణం, ఆయుధాలు, విదేశాంగ విధానం వంటి వాటిల్లో భారత్‌కు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
- LIC IPO Date: ఎల్ఐసీ ఐపీఓ ఇష్యూకు వచ్చేది ఆ రోజే!
ఎప్పుడెప్పుడా అని మదుపరులు ఆసక్తితో ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీఓ.. మార్చి నెలలో రానున్నట్లు తెలుస్తోంది. ఆ నెల మొదటి వారంలో సెబీ అనుమతి లభిస్తే.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇష్యూకు రానున్నట్లు సమాచారం.
- 'భీమ్లా నాయక్' సెన్సార్.. బోయపాటితో రామ్ పాన్ ఇండియా సినిమా
సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో భీమ్లా నాయక్, రామ్-బోయపాటి మూవీ, సూర్య 'ఈటీ' చిత్రాల సంగతులతో పాటు 'తెలుగు ఇండియన్ ఐడల్' సింగింగ్ షో ప్రోమో కూడా ఉంది.
- "కోహ్లీ.. పాక్‌లో సెంచరీ చేస్తే చూడాలని ఉంది"
విరాట్ కోహ్లీ 71వ సెంచరీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ జాబితాలో పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కోహ్లీ పాక్‌లో సెంచరీ చేస్తే చూడాలని ఉందంటూ అక్కడి అభిమానులు ఫ్లకార్డులు చూపిస్తున్నారు. ఇంతకీ ఇది ఎప్పుడు ఎక్కడ జరిగింది?
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM - రాష్ట్రంలో టాప్ వార్తలు
.
Topnews