TNSF Chalo Assembly : 'నిరుద్యోగ రణం పోరాట యాత్ర'లో భాగంగా రేపు రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్లు ఆ సంఘ అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాదయాత్ర సమయంలో.. ఖాళీగా ఉన్న 2లక్షల 35 వేలకు పైగా ఉద్యోగాలను.. అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు దాటిన కూడా హామీ నెరవేర్చలేదని.. నిరుద్యోగ యువతను నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపు చలో అసెంబ్లీ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తెలుగు యువత నాయకులు, టీఎన్ఎస్ఎఫ్, నిరుద్యోగ యువత మొత్తం పాల్గొనాలని కోరారు.
ఇవీ చదవండి: