ఇంద్రకీలాద్రిపై జరిగే దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని విజయవాడ సీపీ శ్రీనివాసులు వెల్లడించారు. శుక్రవారం సీపీ శ్రీనివాసులు దంపతులు కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు 1,597 మంది పోలీస్ సిబ్బంది, 18 సాయుధ బలగాలతో భద్రత కల్పిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఏడు ప్రాంతాల్లో పోలీసు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వీటితో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపడతామని వెల్లడించారు.
ఇదీ చదవండి