Small boy died by fell under bus wheel: కృష్ణాజిల్లా కోడూరుకు చెందిన కోడూరు శ్రీనివాసుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కోడూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. చిన్న కుమారుడు దినేష్ కుమార్. పాఠశాల సమయం కావడంతో రోజులానే శ్రీనివాస్ స్కూలుకు పంపడానికి తన పెద్ద కుమారుడిని తీసుకుని రహదారిపైకి వచ్చి బస్సు ఎక్కించాడు. అన్నకు టాటా చెప్పేందుకు బుడిబుడి అడుగులతో తన వెనకే వచ్చిన చిన్న కుమారుడ్ని తండ్రి గమనించలేదు. సమయం అయిపోతుందన్న హడావిడిలో పాఠశాల బస్సు చక్రం కింద ఉన్న దినేష్‌ను ఎవ్వరూ గమనించలేదు. డ్రైవర్ బస్సును ముందు నడపగా.. అప్పటికే బస్సు చక్రం కింద ఉన్న దినేశ్ పైనుంచి చక్రం వెళ్లడంతో తల భాగమంతా నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఎవరూ ఊహించని ఈ హఠాత్పరిణామంతో తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న కోడూరు ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి :
Fake Currency: కలర్ ప్రింటర్‌తో నకిలీ నోట్లు.. పోలీసుల అదుపులో నిందితులు