ధాన్యం సేకరణకు సంబంధించి రాష్ట్రానికి గోనె సంచుల కొరత ఏర్పడిందని వాటిని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వివరించారు. తక్షణావసరంగా 45 వేల బేళ్లు కావాల్సి ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 4 వేల వరి కోత యంత్రాలను రాష్ట్రంలోని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు వివరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి కేంద్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర అవసరాలను తెలియచేశామని మంత్రి కన్నబాబు వెల్లడించారు. కోళ్ల పరిశ్రమకు ఇబ్బందులు లేవని...కరోనాకు ముందు ఇప్పటి పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు ఉన్నట్లు వెల్లడించారు. దాణా సరఫరాలో లోపం లేదన్నారు. గ్రామస్థాయిలో తొలిసారి ధాన్యం సేకరణ జరుగుతోందని వ్యవసాయశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య వివరించారు. సచివాలయ సిబ్బంది సహకారంతో ఈ సేకరణ జరుగుతుందన్నారు. ఆక్వా ఎగుమతులకు సంబంధించిన పరిస్థితులు మెరుగవుతున్నాయని తెలిపారు.
ఇదీచదవండి