శాంతిభద్రతలు కాపాండేందుకు పోలీసులు ప్రాణత్యాగానికి సైతం వెనుకాడరని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టంచేశారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పోలీసు విభాగాల రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా14 వేల మంది రక్తదానం చేశారని తెలిపిన డీజీపీ, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ రక్తదాన శిబిరంలో డీజీ రవిశంకర్ అయ్యన్నార్, వినీత్ బ్రిజ్ లాల్, ఆక్టోపస్ ఎస్పీ రాధికలు రక్తదానం చేశారు.
ఇదీచదవండి