ETV Bharat / city

రాష్ట్రంలో మూడుకు చేరిన కరోనా కేసుల సంఖ్య

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మూడుకు చేరింది. నెల్లూరులో ఇదివరకే మొదటి కేసు నమోదుకాగా... ఇప్పుడు ఒంగోలు, విశాఖలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో వ్యాధి వ్యాప్తిపై భయాలను తొలగిస్తూనే... వ్యాధి లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్‌-19 నమూనాల పరీక్ష కేంద్రాలను పెంచింది. వాయు, జలమార్గంలో విదేశాల నుంచి వచ్చేవారిని ఎప్పటికప్పుడు పరీక్షించటమే కాకుండా... వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు విమానాశ్రయాలు, నౌకాశ్రయాల వద్ద అంబులెన్సులు సిద్ధంగా ఉంచింది.

రాష్ట్రంలో మూడుకు చేరిన కరోనా కేసుల సంఖ్య
రాష్ట్రంలో మూడుకు చేరిన కరోనా కేసుల సంఖ్య
author img

By

Published : Mar 20, 2020, 6:00 AM IST

Updated : Mar 20, 2020, 7:19 AM IST

రాష్ట్రంలోనూ కరోనా కలవరం పెరుగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది.లండన్ నుంచి తిరిగొచ్చి అనుమానిత లక్షణాలతో ఒంగోలు బోధనాసుపత్రిలో చేరిన యువకుడి నమూనాలు పరీక్షించగా... వ్యాధి సోకినట్లు నిర్ధరణ అయింది. వైద్యఆరోగ్య శాఖ ఈమేరకు ప్రకటించింది. ఆ యువకుడి నివాసానికి 50 మీటర్ల వరకూ బ్లీచింగ్‌ చల్లారు. చుట్టుపక్కల ఇళ్లలో సర్వే చేశారు. ఈ నెల 16న ఆ యువకుడు నెల్లూరుకు బస్సులో వెళ్లాడనే సమాచారంతో... కలిసి ప్రయాణించిన ఆరుగురు నెల్లూరు వాసులను ప్రత్యేకవార్డులో ఉంచారు. మిగిలినవారి వివరాలు సేకరిస్తున్నారు. విశాఖపట్నంలో ఓ 65ఏళ్లు పైబడిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ఇటీవలే మక్కా నుంచి దిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సదరు వ్యక్తి.... ఆ తర్వాత విశాఖ చేరుకున్నట్లు తెలిసింది. కరోనా లక్షణాలతో ఈ నెల 17న ఆసుపత్రిలో చేరగా... ఆయన నమూనాలు పరీక్షకు పంపారు. ఇక రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైన నెల్లూరు యువకుడు కోలుకుంటున్నాడు.

ఈ నెల 11న అమెరికా నుంచి వచ్చి కరోనా లక్షణాలతో బాధపడుతున్న మహిళను... ఒంగోలు రిమ్స్‌లో చేర్చారు. మరో ఏడుగురు అనుమానిత లక్షణాలతో ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 13న AP సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఇండోనేషియా వ్యక్తుల్లో 8 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధరణ కావటంతో... వారు ప్రయాణించిన బోగీలో ఉన్నవారి వివరాలు సేకరిస్తున్నారు. తమిళనాడుకు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు... జ్వరంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలతో కుప్పంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయన కుమారుడు 10 రోజుల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చినట్లు తెలియడంతో... వృద్ధుడిని తిరుపతి స్విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

జర్మనీ, థాయ్‌లాండ్‌ నుంచి దిల్లీ మీదుగా గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆరుగురు విద్యార్థులను... వైద్యులు పరిశీలించారు. వారిలో ఎలాంటి ఇబ్బంది లేని ఇద్దరిని తల్లిదండ్రులతో పంపించేశారు. ఇంటి వద్ద ప్రత్యేక గదిలో ఉండాలని సూచించారు. మరో నలుగురికి జ్వరం లక్షణాలు ఉండటంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. విశాఖలో మొత్తం 10 మంది కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరు ఒడిశా వాసిగా గుర్తించారు. విశాఖ జిల్లాలో ఇప్పటివరకు 31 మంది నమూనాలను పరీక్షల కోసం పంపగా... 26 మందికి నెగెటివ్‌ వచ్చింది. మరో ఐదుగురి నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక 52 దేశాల నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన 12 వందల 21 మంది కదలికలపై నిఘా ఉంచారు. కాకినాడ జీజీహెచ్​లో కరోనా పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించటంతో... వేగంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కరోనా వ్యాప్తి నివారణకు వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, వ్యాయామశాలలు, థియేటర్లు మూసేయాలని సీఎం నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అధికార యంత్రాగం చర్యలు చేపట్టింది. అమరావతిలో ఆందోళన చేస్తున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించామని... గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ కుమార్‌ తెలిపారు. ఫిలిప్పీన్స్‌ నుంచి వచ్చిన 20 మంది విద్యార్థును ఇంటి వద్దనే ఉండాలని సూచించినట్లు చెప్పారు. ఒంగోలులో కరోనా పాజిటివ్‌గా తేలిన యువకుడు... చికిత్స కోసం ఆదివారం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చినట్లు గుర్తించారు. ఎక్కడెక్కడ తిరిగాడనే అంశాన్ని ఆరా తీస్తున్నారు. ఇక గుంటూరులో దుకాణాలు మూసేయాలని ప్రకటనతో... నిత్యావసరాల కోసం మాల్స్‌, దుకాణాల వద్ద జనం బారులు తీరారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణీకులకు అవగాహన కల్పిస్తూనే.. టికెట్‌ కౌంటర్ల వద్ద శానిటైజర్లు ఉంచారు. బస్సుల్లో స్ర్పేలు చల్లుతున్నారు. కృష్ణా జిల్లా నున్నలో పోలీసులు మాస్కులు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చేవారికి కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.

మూడుకు చేరిన కరోనా కేసుల సంఖ్య

ఇదీ చూడండి: 'సంకల్పం, సంయమనంతోనే కరోనాపై విజయం'

Last Updated : Mar 20, 2020, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.