భారత రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ అంబేడ్కర్ సముచిత స్థానం కల్పించారని ప్రజాగాయకుడు గద్దర్ తెలిపారు. కేంద్రప్రభుత్వం నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనానికి ఆయన పేరు పెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు.
ఛాయ్ అమ్ముకునే స్థాయి నుంచి దేశానికి ప్రధాని కావడం మన రాజ్యాంగంలో ఉన్న గొప్పదనమని అన్నారు. మన దేశానికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన పేరు పార్లమెంట్‌కు పెట్టేలా ప్రతి ఎంపీని కలవనున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచేలా కృషి చేస్తామని గద్దర్ తెలిపారు. ఈ డిమాండ్‌ను కేంద్రం అంగీకరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ హెచ్చరించారు.
ఇదీ చూడండి : పందెం కోళ్లకు బ్రహ్మచర్యం తప్పదా?!