ETV Bharat / city

Intermediate Admissions : ఇంటర్మీడియట్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు కసరత్తు - ఏపీలో ఇంటర్మీడియట్‌ ప్రవేశాల వార్తలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు విద్యామండలి కసరత్తు చేస్తోంది. 2020-21, 2021-22 రెండేళ్లు ఆన్‌లైన్‌ ప్రవేశాల నిర్వహణకు నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ న్యాయస్థానం వాటిని కొట్టేసింది. దీంతో ఏ కళాశాలకు ఆ కళాశాల సీట్లను భర్తీ చేసుకున్నాయి. పిల్లలు కోరుకున్న కళాశాలలో సీటు రాకపోతే ఎలా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Intermediate Admissions
Intermediate Admissions
author img

By

Published : Apr 19, 2022, 4:26 AM IST

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ఇంటర్‌ విద్యామండలి కసరత్తు చేస్తోంది. 2020-21, 2021-22 రెండేళ్లు ఆన్‌లైన్‌ ప్రవేశాల నిర్వహణకు నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. దీంతో ఏ కళాశాలకు ఆ కళాశాలే సీట్లను భర్తీ చేసుకున్నాయి. ఈ ఏడాది ఆన్‌లైన్‌ ప్రవేశాల విధానం తీసుకొచ్చేందుకు నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం, కేంద్ర విద్యాశాఖ నియంత్రణలోని ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా (ఎడ్సిల్‌) ప్రతినిధులు, ఇంటర్‌ విద్యామండలి సంయుక్త సంచాలకులతో కమిటీ ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి, ఆన్‌లైన్‌ ప్రవేశాలపై అభిప్రాయాలు సేకరిస్తుంది. స్థానిక, స్థానికేతర రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపులో ఉన్న ఇబ్బందులపైనా అధ్యయనం చేస్తుంది. రిజర్వేషన్లపై కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇంటర్‌ విద్యామండలి.. ప్రభుత్వానికి నివేదిక పంపనుంది.

ప్రతిపాదిత విధానం ఇలా..

ఆన్‌లైన్‌ ప్రవేశాలకు గతంలో ప్రకటించిన విధానం ప్రకారం విద్యార్థులు ఇంటర్‌ విద్యామండలి వెబ్‌సైట్‌ నుంచి కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సెక్షన్‌లో 88 సీట్లు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు, అందుబాటులో ఉన్న సీట్లు, పదో తరగతి మార్కుల ఆధారంగా ఆన్‌లైన్‌లో సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఇచ్చే ఐచ్ఛికాల్లో ఏదో ఒక కళాశాలలో సీటు కేటాయిస్తారు. మొదటి విడతలో సీటు రాకపోయినా, మొదటిసారి వచ్చిన సీటు నచ్చకపోయినా రెండో కౌన్సెలింగ్‌లో మార్చుకోవచ్చు.

ఎన్నో ప్రశ్నలు.. ఎంతో ఆందోళన

* పదో తరగతి విద్యార్థికి ఆన్‌లైన్‌లో కళాశాలను ఎంపిక చేసుకునే పరిజ్ఞానం ఉంటుందా? చదువుకోని తల్లిదండ్రులు ఉంటే ఐచ్ఛికాల నమోదు ఎలా?
* ఇంటికి దగ్గరలో ఉన్న కళాశాలలో చేర్పించాలనుకున్నప్పుడు అక్కడ సీటు రాకపోతే ఏం చేయాలి? ముఖ్యంగా అమ్మాయిలకు ఇంటికి దూరంగా ఉన్న కళాశాలలో సీటొస్తే వెళ్లి, రావడం ఇబ్బంది కాదా?
* పదిలో అధిక మార్కులు వచ్చినవారికి మంచి కళాశాలలో సీటు దొరుకుతుంది. ఇతరులకు వేరే కళాశాలలో వస్తాయి. ఇంటర్‌ తర్వాత జేఈఈ, నీట్‌, ఎంసెట్‌ లాంటి పరీక్షల తర్ఫీదు ఇచ్చే వాటిలో సీటు రాకపోతే ఏం చేయాలి?

రాయలసీమ వారి పరిస్థితి ఏంటి?

ఉమ్మడి జిల్లాల ప్రకారం రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు జిల్లా.. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం రీజియన్‌లో ఉండగా మిగతా అన్ని జిల్లాలు ఆంధ్ర వర్సిటీ రీజియన్‌లో ఉన్నాయి. ఆన్‌లైన్‌ ప్రవేశాల విధానం ప్రకారం ఒక రీజియన్‌కు చెందినవారు (స్థానికేతరులు) మరో రీజియన్‌లో చేరాలనుకుంటే 15 శాతం సీట్లే ఉంటాయి. ఈ ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలాంటి చోట్ల కొన్ని కళాశాలల్లో సీట్లకు భారీ డిమాండ్‌ ఉంటుంది. స్థానికేతరులు కాబట్టి రాయలసీమ, నెల్లూరు జిల్లాల విద్యార్థులకు ఇక్కడ సీట్లు దొరకడం కష్టమవుతుంది. మరోవైపు జేఈఈ, నీట్‌ కోసం ప్రత్యేక శిక్షణతో ఇంటర్మీడియట్‌ చదవాలనుకునే వారికి ఆ సౌకర్యాలున్న మంచి కళాశాలల్లో సీట్లు ఎలాగన్న ఆందోళన వ్యక్తమవుతుంది. వీటన్నింటిపైనా కసరత్తు కొనసాగుతోంది.

ఇదీ చదవండి: SSC Exams : కష్టపడితే ఫలితం.. 'పది'లమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.