ETV Bharat / city

కొవిడ్ ఆస్పత్రిలో అదృశ్యమైన వృద్ధుడి ఆచూకీ లభ్యం...వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా నిరసన - విజయవాడ తాజా వార్తలు

విజయవాడ కొవిడ్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. వారం రోజుల క్రితం కరోనాతో వృద్ధుడు మృతి చెందగా... బంధువులకు సమాచారం ఇవ్వలేదు. మార్చురీలోనే పెట్టి వదిలేశారు. వారం రోజుల నుంచి వృద్ధుడి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నా పట్టించుకోలేదు. వృద్ధుడి అదృశ్యంపై మీడియాలో ప్రసారమైన కథనాలతో కదిలిన సిబ్బంది చివరకు... చేరిన మరుసటి రోజే ఆ వృద్ధుడి చనిపోయాడని.. మృతదేహం మార్చురీలోనే ఉదంటూ చావు కబురు చల్లగా చెప్పారు.

The disappearance of an elderly man who had disappeared at Vijayawada Kovid hospital was finally found.
విజయవాడ కొవిడ్ ఆస్పత్రిలో అదృశ్యమైన వృద్ధుడి ఆచూకీ లభ్యం
author img

By

Published : Jul 3, 2020, 10:35 PM IST

విజయవాడ 1వ పట్టణ పరిధిలో నివసించే వసంతరావు ఆరోగ్యం సరిగా లేకపోవటంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది కరోనా లక్షణాలున్నాయనే అనుమానంతో జూన్ 24న కొవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబ సభ్యులు అలాగే కొవిడ్ ఆస్పత్రికి వెళ్లారు. అదే రోజు వృద్ధుడికి చికిత్స చేసేందుకు కోవిడ్ ఆసుపత్రి సిబ్బంది లోపలికి తీసుకువెళ్లారు. వృద్ధుడి భార్య ధనలక్ష్మి ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. వైద్యం కోసం వృద్ధుడి ఆధార్ కార్డ్ తీసుకుని రమ్మని వైద్య సిబ్బంది చెప్పడంతో ఆమె ఆరాత్రి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం ఆధార్‌ కార్డు తీసుకెళ్లి అడిగేసరికి .. వసంతరావు ఎక్కడున్నాడో తమకు తెలియదని సిబ్బంది చెప్పారు. అప్పటి నుంచి ఆమె వృద్ధుడి ఆచూకీ కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతూనే ఉన్నా.. సమాధానం ఇచ్చేవారే కరవయ్యారు.

చివరకు ఆమె తన భర్త వసంతరావు ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆసుపత్రి సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. అందులో వసంతరావును వీల్ ఛైర్ లో తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. అయినా ఆసుపత్రి సిబ్బంది పాతపాటే పాడారు. ఆ వృద్ధురాలి ఆవేదనపై మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చాయి.

విజయవాడ కొవిడ్ ఆస్పత్రిలో అదృశ్యమైన వృద్ధుడి ఆచూకీ లభ్యం

వాస్తవానికి గతనెల 24న కొవిడ్ ఆస్పత్రికి వృద్ధుడిని తీసుకొచ్చారు. జూన్ 25న తెల్లవారుజామునే వృద్ధుడు చనిపోయాడు. ఆరోజే మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే సిబ్బంది అక్కడితో చేతులు దులిపేసుకున్నారు. కనీసం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలన్న ఇంగితం మరిచారు. ఆ వృద్ధురాలి పలుసార్లు తన భర్త ఆచూకీ కోసం వచ్చి అడిగినా పట్టించుకోకపోవడం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. చివరకు మీడియా కథనాలతో కదిలిన సిబ్బంది.. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకున్నారు. మృతదేహం కోసం మార్చురీలోనే ఉందంటూ వృద్ధుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వ్యక్తి చనిపోతే.. కుటుంబసభ్యులకు కనీసం సమాచారం ఇవ్వని సిబ్బంది అంతులేని నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తమవుతోంది.

ఇవీ చదవండి: కొవిడ్ ఆస్పత్రిలో వారం క్రితం వృద్ధుడు అదృశ్యం..మార్చురీలో మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.