ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా... వివిధ జిల్లాలకు చెందిన బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఏపీ ట్రాన్స్కో, జెన్కో వంటి పలు విద్యుత్ సంస్థల్లో 50 శాతం డైరెక్టర్లను బీసీలకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అలానే రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కువగా నష్టపోయింది విద్యుత్ ఉద్యోగులేనని అన్నారు. సుమారు 1156 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని... వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. తమ సంఘం ఎప్పుడూ బీసీ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటుందని... త్వరలో మరికొన్ని సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.
ఇవీ చదవండి..."మా బాధలు చెప్పుకునే అవకాశం ఇవ్వండి"