సినీ పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై సి.కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాతల విజ్ఞప్తులను కూడా ముఖ్యమంత్రి జగన్ పరిశీలనలోకి తీసుకోవాలని కోరారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో థియేటర్ల విద్యుత్ బిల్లులు రద్దు చేయడం విషయంలో నిర్మాతలకు ప్రయోజనమేమీ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో చిన్న సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించాలని సి.కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కువైట్ నుంచి చేరుకుంది.. గన్నవరంలో అదృశ్యమైంది!