ETV Bharat / city

Fake Swiss Bank ఈ స్విస్​బ్యాంకులో నగదు జమ చేస్తే స్వాహా..! - భారత్ స్విస్ బ్యాంకు

Fake Swiss Bank : ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్​తో 1:3 లాభాలు వస్తాయని ఆశ చూపాడు. నమ్మకం కలిగేలా బాధితులను విమానాల్లో దిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడ ఖరీదైన హోటళ్లలో ఉంచి.. విందు వినోదాలతో వారిని మాయచేశాడు. వారు నమ్మేలా కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లు చర్చలు జరిపాడు. ఇదంతా నిజమేననుకుని నమ్మిన బాధితులు అతడి వద్ద కోట్ల రూపాయలు జమచేశారు. చివరకు అదంతా మోసమని గ్రహించి లబోదిబోమంటున్నారు.

Fake Swiss Bank
Fake Swiss Bank
author img

By

Published : Dec 16, 2021, 12:36 PM IST

Fake Swiss Bank : అడ్డదారిలో రూ.కోట్లు కొట్టేసేందుకు మాయగాళ్లు వేసిన ఎత్తుగడను నమ్మి ఎంతోమంది కోట్లాది రూపాయలు మోసపోయారు. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.1.31 కోట్లు, కారు, సెల్‌పోన్లు, ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.కోటి 76 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దేవనాగేరి సత్యనారాయణ(53) స్వస్థలం కర్ణాటకలోని బెల్గాం. ఇనుము తుక్కు వ్యాపారి. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో లక్షలాదిరూపాయలు మోసపోయి మాయగాడిగా కొత్త అవతారమెత్తాడు. వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని పథకాన్ని అమలు పరిచాడు. ఉక్కు పరిశ్రమలో పనిచేసేటప్పుడు యజమాని తన పేరిట సెకండ్‌ఛానల్‌ (ఐసీఐసీఐ) ఖాతాలో రూ.10,000 కోట్లు జమ చేశారని, యజమాని మరణంతో లావాదేవీలు నిలిచిపోయాయంటూ కొన్ని పత్రాలను రుజువుగా చూపేవాడు.

అలా నమ్మించాడు..

Fake Swiss Bank in India : ఆ ఖాతాలోని నగదును ఇతర ఖాతాల్లోకి మళ్లించేందుకు సెకండ్‌ ఛానల్‌లో ఖాతా తెరవాలి. రహస్య బ్యాంకు ఖాతా ద్వారా ట్రేడ్‌ ప్రాఫిట్‌ ఫండ్‌ తో 1:3 నిష్పత్తిలో లాభాలు వస్తాయంటూ ఆశ చూపేవాడు. దీనిపై మరింత నమ్మకం కలిగించేందుకు బాధితులను విమానాల్లో దిల్లీ తీసుకెళ్లేవాడు. అక్కడ ఖరీదైన హోటళ్లలో విందులు, వినోదాలతో ముంచేవాడు. అక్కడ సత్యనారాయణ సెకండ్‌ఛానల్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అంటూ అజయ్‌పాల్‌సింగ్‌ అలియాస్‌ ప్రియరంజన్‌ నాయక్‌ను పరిచయం చేసేవాడు. సమావేశాల్లో బాధితులను అకట్టుకునేలా కోట్లల్లో లావాదేవీలు జరుగుతున్నట్టు చర్చించేవాడు. దిల్లీలోని సెకండ్‌ఛానల్‌ బ్యాంకు వద్దకు తీసుకెళ్లి హడావుడి చేసేవాడు. ఖాతా తెరిచేందుకు స్లాట్‌బుకింగ్‌, ఎకౌంట్‌రెంట్‌, మీటింగ్స్‌ తదితర వాటికి ఛార్జీలు చెల్లించాలంటూ బాధితులతో రూ.18 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకూ తన ఖాతాల్లో నగదు జమ చేయించుకున్నాడు. సత్యనారాయణ తన కమీషన్‌ను మినహాయించుకుని మిగతా సొమ్మును రేఖామూవీస్‌ పేరుతో ఉన్న ఖాతాకు మళ్లించేవాడు.

నమ్మారు.. నట్టేట మునిగారు..

Indian Swiss Bank : భాగ్యనగరానికి చెందిన ముగ్గురు బాధితులు.. ఇది నిజమని భావించి రూ.2.1కోట్లు అతడు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. మోసపోయినట్టు పోలీసులకు ఫిర్యాదుతో చేయడంతో ముఠా బండారం బట్టబయలైంది. దేవనాగేరి సత్యనారాయణ, ప్రియరంజన్‌నాయక్‌, కూడికల ప్రేమ్‌ కిషోర్‌, విశాల్‌ సక్పాల్‌, సుశాంత్‌ ప్రేమ్‌ దాస్‌ గౌరవ్‌లను నిందితులుగా గుర్తించారు. వీరిలో ప్రియరంజన్‌ నాయక్‌, సుశాంత్‌ప్రేమ్‌దాస్‌ గౌరవ్‌లను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. నిందితులను పోలీసు కస్టడీకు తీసుకున్నారు.

అసలు సూత్రధారి బ్యాంకు ఉద్యోగి..

Indian Swiss Bank Cheating : భారతదేశంలో స్విస్‌బ్యాంకు. ఐసీఐసీఐ ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీల్లో రూ.వేలకోట్ల నగదు ఉంది. రహస్యంగా జరిగే ట్రేడింగ్‌తో రూ.కోటి పెట్టుబడితో రూ.70లక్షలు లాభం పొందవచ్చంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలో కీలక సూత్రదారి కూడికల ప్రేమ్‌కిషోర్‌(48) దమ్మాయిగూడ వాయుశక్తినగర్‌ నివాసి. ఐసీఐసీఐలో గృహరుణాల విభాగంలో పనిచేశాడు. బ్యాంకులో జరిగే లావాదేవీలపై పట్టుంది. దిల్లీలోని ఒక బ్యాంకు 3శాతానికే రుణాలు ఇస్తున్నట్టు తెలుసుకుని పరిశీలించేందుకు అక్కడకు వెళ్లాడు. అడ్డదారిలో డబ్బు సంపాదనకు మోసాలను మార్గంగా ఎంచుకున్నాడు. అజయ్‌పాల్‌సింగ్‌, సత్యనారాయణతో కలసి పక్కా పథకం ప్రకారం సెకండ్‌ ఛానల్‌ ఖాతాలను తెరమీదకు తెచ్చాడు. కొద్దిపెట్టుబడితో లాభాలు వస్తాయనే ఆశతో వచ్చిన వారిని నమ్మించేలా నక్షత్రాల హోటళ్లలో సమావేశాలు, విమానాల్లో ప్రయాణాలు ఏర్పాటు చేసేవాడు. సింగపూర్‌, మలేషియా వంటి ప్రాంతాలకూ తీసుకెళ్లేవాడు. ఐసీఐసీఐ సెకండ్‌ఛానల్‌ ఖాతాలు ఉన్నట్టు రుజువులుగా నకిలీ పత్రాలతో చూపేవాడు. ట్రేడింగ్‌ ద్వారా ఖాతాలను తిరిగి వాడుకలోకి తీసుకు వచ్చేందుకు వివిధ రకాల రుసుముల పేరుతో బాధితుల నుంచి తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయించుకునేవాడు.

ఇదీ చదవండి:

Amravati Sabha at Tirupati: రేపు 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ'..చురుగ్గా ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.