ETV Bharat / city

దాల్మియా కేసులో చర్యలు కొనసాగించొచ్చు: తెలంగాణ హైకోర్టు - జగన్ కేసుపై తెలంగాణ హైకోర్టు

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియాకు సమన్లు జారీ చేయడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది.

దాల్మియా కేసులో చర్యలు కొనసాగించొచ్చు
దాల్మియా కేసులో చర్యలు కొనసాగించొచ్చు
author img

By

Published : Feb 6, 2021, 4:52 AM IST

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియాకు సమన్లు జారీ చేయడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. క్రిమినల్ కేసులకు సంబంధించి రిట్ పిటిషన్ వేయడమే కాకుండా అందులో వచ్చిన ఉత్తర్వులపై అప్పీలు దాఖలు చేయడం ఏమిటని..ప్రశ్నించింది. వీటిపై అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి ఉండగా...అప్పీలు దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. విచారణతో సంబంధం లేకుండా దాల్మియా సిమెంట్స్, దాల్మియా వ్యవహారంలో చట్టప్రకారం చర్యలు కొనసాగించవచ్చంటూ ఈడీకి సూచించింది. ఈ అప్పీళ్ల విచారణార్హత ఏమిటో చెప్పాలంటూ దాల్మియాకు సూచించింది.

ఈ నోటీసులు జారీ చేయడాన్ని, హాజరుకాకపోవడంతో క్రిమినల్ చర్యలు చేపడతామంటూ ఈడీ నోటీసు ఇవ్వడంపై సింగిల్ జడ్జి పిటిషన్లను కొట్టి వేయగా దాల్మియా సిమెంట్స్, భారత్ లిమిటెడ్, పునీత్ దాల్మియాలు వేర్వేరుగా రెండు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలు విచారణ చేపట్టగా పిటిషనర్ తరపు న్యాయవాది ఎన్.నవీన్ కుమార్ వాదనలు వినిపిస్తూ తమ వివరణను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. దీనిపై సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించడానికి గడువు కావాలని కోరారు. దీనికి ధర్మాసనం అనుమతిస్తూ విచారణను జూన్‌కు 18కి వాయిదా వేసింది.

ఇదీచదవండి

'తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏకగ్రీవమైనట్లు ప్రకటించవద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.