కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 92.95 శాతం పోలింగ్ నమోదైంది. గుంటూరు జిల్లాలో 92.73 శాతం, కృష్ణా జిల్లాలో 93.21 శాతంగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మొత్తం 13 వేల 505 ఓటర్లుండగా...12 వేల 554 మంది ఉపాధ్యాయులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. గుంటూరు, కృష్ణా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 17న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇదీచదవండి