ETV Bharat / city

Teacher posts: ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులకు మంగళం - ఏపీలో ప్రధానోపాధ్యాయ పోస్టులకు మంగళం

Teacher posts: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు.. ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

teacher posts formats changed in andhra pradesh
ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులకు మంగళం
author img

By

Published : Jun 11, 2022, 9:16 AM IST

Teacher posts: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం మంగళం పాడింది. 3-10 తరగతులు ఉండే ఉన్నత పాఠశాలలో 137 మంది, 6-10 తరగతుల బడిలో 92 మందిలోపు విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయ, పీఈటీ పోస్టులు ఉండవు. 17 సెక్షన్ల విద్యార్థులకు ఒకే ఒక్క హిందీ ఉపాధ్యాయుడు పాఠాలు బోధించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

19 సెక్షన్లకు మూడు గణితం, సాంఘికశాస్త్రం పోస్టులిచ్చింది. దీంతో వారానికి ప్రతి ఉపాధ్యాయుడు 48 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. ఇది ఉపాధ్యాయులపై పని భారం పెంచనుంది. 6-10 తరగతుల్లో 18 సెక్షన్లకు 21 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. ఉపాధ్యాయులు ఒకరు, ఇద్దరు సెలవు పెడితే తరగతుల నిర్వహణ కష్టంగా మారుతుంది. 3-8 తరగతులకు అసలు ప్రధానోపాధ్యాయుడి పోస్టునే కేటాయించలేదు.

రాష్ట్రంలో ఒకటి, రెండు తరగతులు ఉండే ఫౌండేషన్‌, 1-5 తరగతులు ఉండే ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ను నియమించనున్నారు. విద్యార్థుల సంఖ్య 31కి చేరితే రెండో ఎస్జీటీని ఇస్తారు. రాష్ట్రంలో ఎక్కువగా 30లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలే అధికంగా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలన్నీ ఏకోపాధ్యాయ బడులుగా మారతాయి. 121 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రధానోపాధ్యాయుడి పోస్టు కేటాయిస్తారు. 10 మందిలోపు విద్యార్థులు ఉంటే కమిషనర్‌కు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

హేతుబద్ధీకరణలో ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉంటే అవసరమైన పాఠశాలకు మార్పు చేస్తారు. ఒకవేళ ఆ పాఠశాలలో ఖాళీ పోస్టు ఉంటే దానిని మాత్రమే మరో పాఠశాలకు మార్చుతారు. పోస్టు లేని సమయంలో ఉపాధ్యాయుల్లో జూనియర్‌ కొత్త పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. సీనియర్‌ ఉపాధ్యాయులు వెళ్లడానికి ఆసక్తి చూపితే వారికి ముందు అవకాశం కల్పిస్తారు.

8 వరకు ఒకే మాధ్యమం

ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతుల్లోనే తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు అమలు చేయాలని, మిగతా అన్ని తరగతుల్లోనూ ఒకే మాధ్యమం నిర్వహించాలని ఆదేశించింది. ఈ లెక్కన 8వ తరగతి వరకు ఒక్క ఆంగ్ల మాధ్యమమే ఉంటుంది. దీంతో చాలా ఉపాధ్యాయ పోస్టులు రద్దవుతాయి. పోస్టులను మిగుల్చుకునేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. రెండు మాధ్యమాలు ఉంటే రెండింటికి ఉపాధ్యాయులను కేటాయించాల్సి ఉంటుందనే ఒక్క ఆంగ్ల మాధ్యమమే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ హేతుబద్ధీకరణను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

కలెక్టర్‌ ఛైర్మన్‌గా కమిటీ..

  • జిల్లా స్థాయిలో హేతుబద్ధీకరణ కమిటీకి కలెక్టర్‌ ఛైర్మన్‌గా, సంయుక్త కలెక్టర్‌ వైస్‌ ఛైర్మన్‌గా, జడ్పీ సీఈఓ, పురపాలక కమిషనర్‌, సమగ్ర శిక్ష ఏపీసీ సభ్యులుగా, డీఈఓలు సభ్య కన్వీనర్లుగా ఉంటారు. డీఈఓ రూపొందించిన నివేదికను ఈ కమిటీ ముందు ఉంచాల్సి ఉంటుంది.
  • 3-8 తరగతులు ఉండే ప్రీ హైస్కూల్‌లో 195 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండి, దీనికి మూడు కిలోమీటర్ల దూరంలో హైస్కూల్‌ లేకపోతే దీన్ని ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరిస్తారు. 98 మంది కంటే తక్కువ ఉంటే 30 మందికి ఒకటి చొప్పున ఎస్జీటీలను ఇస్తారు. ఏడో తరగతి వరకు ప్రీ హైస్కూల్‌ను 8వ తరగతి వరకు ఉన్నతీకరిస్తారు.
  • హైస్కూళ్లల్లో (3-10తరగతులు) సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరిస్తారు. 138 మందికి మించి విద్యార్థులు ఉంటేనే హెచ్‌ఎం, పీఈటీ పోస్టులు ఇస్తారు.
  • 275 మంది బాలికలు ఉన్న పాఠశాలలో మ్యూజిక్‌, డ్రాయింగ్‌, కుట్టుమిషన్‌ శిక్షణకు ఇన్‌స్ట్రక్టర్లను ఏర్పాటు చేస్తారు.
  • ఒకే ప్రాంగణంలో ఉండే 1-10 తరగతులకు హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడే ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారు.
  • కేవలం 6-10తరగతులు ఉన్న హైస్కూల్‌లో 93 మందికిపైగా విద్యార్థులు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టు ఇస్తారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.