రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దమని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అధికారులను బెదిరించి, వ్యవస్థలను ధ్వంసం చేసి రాజ్యం చేయాలన్న దుష్టతలంపుతోనే ఈ తరహా చర్యలను వైకాపా ప్రభుత్వం చేపడుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అనైతిక పాలన సాగుతోందన్న యనమల.. ఎన్నికల కమిషనర్నే తీసేస్తామని బెదిరించే పరిస్థితి వస్తే ఇక స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు ఎలా జరుగుతాయని నిలదీశారు. అలా ఎన్నికలు జరగకపోతే, ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వైకాపా ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్న యనమల... ఒకసారి ఎస్‌ఈసీని గవర్నర్ నియమించి పదవీకాలం 5 ఏళ్లని నిర్ణయించాక ఆయణ్ని తొలగించే అధికారం పార్లమెంటుకు తప్ప ఎవరికీ లేదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో బెదిరింపు రాజకీయాలు : యనమల - యనమల వీడియో కాన్ఫరెన్స్
ఎన్నికల సంఘం స్వయం నిర్ణయాధికారాన్ని కోల్పోయేలా వైకాపా ప్రభుత్వం చేస్తోందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఈసీ పదవీ కాలం తగ్గిస్తూ... ప్రభుత్వం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.
![రాష్ట్రంలో బెదిరింపు రాజకీయాలు : యనమల tdp yanamala ramakrishna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6744028-746-6744028-1586547027027.jpg?imwidth=3840)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దమని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అధికారులను బెదిరించి, వ్యవస్థలను ధ్వంసం చేసి రాజ్యం చేయాలన్న దుష్టతలంపుతోనే ఈ తరహా చర్యలను వైకాపా ప్రభుత్వం చేపడుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అనైతిక పాలన సాగుతోందన్న యనమల.. ఎన్నికల కమిషనర్నే తీసేస్తామని బెదిరించే పరిస్థితి వస్తే ఇక స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు ఎలా జరుగుతాయని నిలదీశారు. అలా ఎన్నికలు జరగకపోతే, ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వైకాపా ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్న యనమల... ఒకసారి ఎస్‌ఈసీని గవర్నర్ నియమించి పదవీకాలం 5 ఏళ్లని నిర్ణయించాక ఆయణ్ని తొలగించే అధికారం పార్లమెంటుకు తప్ప ఎవరికీ లేదని అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి-ఎస్ఈసీ తొలగింపు.. ప్రభుత్వ కక్ష సాధింపే: పవన్