రైతు వ్యతిరేక చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కిసాన్ సంయుక్త మోర్చా ఈ నెల 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. రైతు సంఘాల సమన్వయ కమిటీ, విశాఖ ఉక్కు పోరాట వేదిక సభ్యులు.. తెదేపా కేంద్ర కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్సీలు టి.డి.జనార్దన్, పర్చూరు అశోక్ బాబును కలిశారు.
బంద్‌కు తెదేపా తరఫున మద్దతు కోరారు. రైతు సమస్యలపై పోరాటంలో తెదేపా ఎప్పుడూ ముందుంటుందని.. నేతలు వారికి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని మొదటినుంచి వ్యతిరేకిస్తున్నామని గుర్తు చేశారు. బంద్ కు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి:
'ఆదాయం ఉన్న రైల్వే స్టేషన్ను ప్రైవేటీకరిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?'