ETV Bharat / city

TDP protest: 'తొలగించిన పింఛన్లను తక్షణమే పునరుద్ధరించాలి' - తెదేపా నాయకుల రాష్ట్రవ్యాప్త అందోళనలు

అధికారంలోకి వస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి.. ఇప్పుడు అర్హుల పింఛన్లు రద్దు చేశారని తెదేపా నేతలు ఆరోపించారు. తొలగించిన పింఛన్లు, రేషన్​ కార్డులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెదేపా శ్రేణులు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలు(tpd protest) చేపట్టారు.

TDP Nirasana
పింఛన్ల కోతలపై తెదేపా నిరసనలు
author img

By

Published : Sep 3, 2021, 10:32 PM IST

అడ్డగోలు నిబంధనలతో పింఛన్, బియ్యం కార్డుల్లో కోత విధించవద్దని తెదేపా నాయకులు కోరారు. ఈ మేరకు గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, నందివాడ మండల పరిషత్ అధికారి కృష్ణ ప్రసాద్​కు వినతి పత్రాలు అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు విస్మరిస్తూ.. ఈ కేవైసీ వంటి అడ్డగోలు నిబంధనలతో లక్షలాది మంది బియ్యం కార్డులు, పింఛన్ లబ్ధిదారులను తొలగించడాన్ని గుడివాడ తెదేపా అధ్యక్షుడు దింట్యాల రాంబాబు ఖండించారు. ప్రభుత్వ ఈ నిరంకుశ వైఖరి మారకపోతే.. లబ్ధిదారుల పక్షాన తెదేపా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

గుంటూరులో...

రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన పింఛన్ల(remove pentions)ను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ.. గుంటూరు నగరపాలకసంస్థ ఎదుట తెదేపా నేతలు(tpd protest) నిరసన చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యవతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు. వైకాపా ప్రభుత్వం అనాలోచిన నిర్ణయాలతో లక్షలాదిమంది లబ్ధిదారులు పింఛన్​ను​ కోల్పోయారని తెదేపా గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులను అడగ్గా.. కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు. ఇంట్లో ఒకరికి మాత్రమే పింఛన్​ అంటూ.. లక్షలాది మందికి ఆసరాను దూరం చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రతి అవ్వ, తాతకు రూ.3,000 ఇస్తానన్న హామీకి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. సీఎం జగన్​కి ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువ అని తెదేపా గుంటూరు పశ్చిమ ఇన్​ఛార్జీ కోవెలమూడి రవీంద్ర విమర్శించారు. ఆవేశంలో సాధ్యంకాని పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మోసగిస్తున్నారని పేర్కోన్నారు. రాబోయే రెండు రోజుల్లో తొలగించిన పింఛన్లు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

చిత్తూరు జిల్లాలో..

పింఛన్ల తొలగింపుకు నిరసనగా.. కుప్పంలో తెదేపా ఆందోళనలు చేపట్టింది. తొలగించిన సామాజిక పింఛన్లను వెంటనే పునరుద్దరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. చంద్రగిరి ఎంపీడీవో కార్యాలయం ఎదుట తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు పల్లి సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అర్హులైన పేదలందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పొంతనలేని నిబంధనలు పెట్టి రేషన్​ కార్డులు, లబ్ధిదారుల పింఛన్​ తొలగించడం సబబు కాదన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏవో మురళీధర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

అనంతపురం జిల్లాలో..

తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని అనంతపురం నగరపాలక సంస్థ వద్ద తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన సీఎం జగన్​.. అధికారంలోకి వచ్చాక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అండగా తెదేపా ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రజలకు అండగా తెదేపా ఉందన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వీవీఎస్ మూర్తికి వినతిపత్రం ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పింఛన్లు తొలగించే కార్యక్రమాన్ని చేపడుతోందని ఆరోపిస్తూ.. హిందూపురం పురపాలక సంఘ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. పింఛన్ల తొలగింపు కార్యక్రమానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టణంలోని 6 వార్డుకు చెందిన ఓ వికలాంగుడికి ప్రజాసాధికారిక సర్వే కారణం చూపుతూ పింఛన్ తొలగించారని.. బాధితునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే తరహాలో రాష్ట్రంలో తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండే చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్​కు వినతిపత్రం అందించారు.

విజయనగరం జిల్లాలో...

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని వృద్ధులకు ఇచ్చే పింఛన్​ తొలగించడం సిగ్గుచేటని తెదేపా నాయకులు, విజయనగరం మాజీ జడ్పీటీసీ తుంపల్లి రమణ అన్నారు. అర్హత ఉన్నప్పటికీ పొంతనలేని సాకులు చెబుతూ.. పింఛన్లు తొలగింపు సరికాదన్నారు. తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ.. విజయనగరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన తెదేపా శ్రేణులు.. ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్​కు వినతి పత్రం ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో.. తాను అధికారంలోకి వస్తే రూ. 2వేల పింఛన్​ను రూ. 3వేలు చేస్తానన్న హామీని అమలు చేయాలని రమణ డిమాండ్ చేశారు.

నింబంధనల పేరుతో పేదలు, పింఛన్​దారులను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తుందని తెదేపా మహిళా నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. తద్వారా పేదలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు, రేషన్​ కార్డుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సాలూరు పట్టణ పరిధిలో ఉంటున్న మోహన్ అనే వ్యక్తికి 90% అంగవైకల్యం ఉందని ప్రభుత్వం తరుపున వైద్యాధికారులు ధృవీకరించారు.. అయినా అతని పింఛన్​ ఆగిపోయింది. ఇలాంటి వారు చాలమంది ఉన్నారని.. సదరు బాధితులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.

శ్రీకాకుళం జిల్లాలో..

పాలకొండ నగర పంచాయతీతోపాటు మండలంలో తొలగించిన పించన్లను పునరుద్ధరించాలని కోరుతూ.. తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పించన్లు తొలగించడం సరికాదని.. అందరికీ తిరిగి అందించాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు గంట సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు.

ప్రకాశం జిల్లాలో...

అర్హులకు పింఛన్లు, రేషన్​ కార్డులను రద్దుచేయడం అన్యాయమని ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి అన్నారు. జరుగుమల్లి మండలంలో అత్యధికంగా వృద్ధ్యాప్య, వికలాంగుల పింఛన్ల తొలిగించడంపై తెలుగుదేశం నాయకులతో కలిసి నిరసన తెలిపారు. వెంటనే ఆ పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ.. ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

వివిధ నిబంధనల పేరుతో.. ఏళ్లుగా ఫింఛను పొందుతున్న లబ్ధిదారులను తొలగించడం దారుణమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. వృద్ధాప్యంలో ఆసరా ఇస్తున్న ఫింఛన్లు తొలగించి పండు వయసులో వాళ్ల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. పింఛన్​లలో కోత విధించాలన్న ప్రభుత్వ ఆలోచనల్లో భాగంగానే కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చారని కొత్తపేట మండలం వాడపాలెంలో అన్నారు. గ్రామ సచివాలయ సిబ్బందిలో సుమారు 90 శాతం పైబడి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారే.. వారి ఫింఛన్లు తొలగించారు. అర్దాంతరంగా తొలగించడంతో వారి జీవనం దుర్భరమవుతుంది. వెంటనే తొలగించిన పిఛన్లను పునరుద్ధరించాలి అని బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..

వైకాపా ప్రభుత్వం.. ఫించన్లు తొలగించి వృద్ధులను మానసికంగా వేధింపులకు గురి చేస్తుందని మాజీ జడ్పీటీసీ సభ్యుడు నల్లూరు చలపతిరావు అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా టీ నరసాపురం, చింతలపూడి మండలాలకు చెందిన తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు. వెంటనే పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి...

Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెనపై హైకోర్టు కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.