ETV Bharat / city

Atchenna On pensions: పింఛన్లపై సీఎం జగన్ మడమ తిప్పారు: అచ్చెన్నాయుడు

author img

By

Published : Jan 1, 2022, 6:41 PM IST

Atchenna On pensions: పింఛన్ల పెంపు హామీపై సీఎం జగన్ మడమ తిప్పారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటినా..పెంచింది రూ.250 మాత్రమేనన్నారు. జగన్ మోసంతో ఒక్కో లబ్ధిదారుడికి రూ.23,250 నష్టం వాటిల్లిందన్నారు.

పింఛన్ల హామీపై సీఎం జగన్ మడమ తిప్పారు
పింఛన్ల హామీపై సీఎం జగన్ మడమ తిప్పారు

Atchenna On pensions: పింఛన్​పై ముఖ్యమంత్రి జగన్ మడమ తిప్పారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధుల ఫించన్​ను రూ.2000 నుంచి రూ.3000 లకు పెంచుతానని తిరుపతి సభలో హామీ ఇచ్చారని.. అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ పెంచింది కేవలం రూ.250 మాత్రమేనని మండిపడ్డారు.

జగన్ మోసకారి మాటలతో పింఛన్​దారులకు భారీగా నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లలో రూ.250 పెంచి ఒక్కొక్కరికీ రూ.23,250 ఎగనామం పెట్టారని అన్నారు. మొత్తం 54.25 లక్షల పెన్షన్​దారులకు రూ.12,613 కోట్లు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రూ.1800 పెంచినా.. ప్రచారం చేసుకోలేదని, జగన్ రెడ్డి రూ.250 పెంచి.. రూ.20 కోట్లు ఖర్చు పెట్టి పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

అచ్చెన్నకు శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు..
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అచ్చెన్న స్వగ్రామం.. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి :

CM Jagan At YSR Pension: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.