ETV Bharat / city

atchannaidu: ఎస్సీలను అణచివేయడమే వైకాపా నైజం: అచ్చెన్నాయుడు

ఎస్సీలను అణచివేయడమే వైకాపా నైజంగా కనిపిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో దళితులపై వైకాపా నాయకుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు
author img

By

Published : Oct 17, 2021, 10:34 AM IST

ఎస్సీలను అణచివేయడమే వైకాపా నైజంగా కనిపిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు(TDP STATE PRESIDENT) కింజరాపు అచ్చెన్నాయుడు(atchannaidu) దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో దళితులపై వైకాపా నాయకుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. జగన్ పాలనపై ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారనే... దాడులు చేసి బెదిరిస్తున్నారని అచ్చెన్న వాపోయారు. పరిషత్ ఎన్నికల్లో వైకాపా నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణం అవుతారా? అని నిలదీశారు.

సొంత నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులు చేస్తుంటే విద్యాశాఖ మంత్రి సురేష్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైకాపాలోని ఓ వర్గానికి సురేష్ భయపడుతున్నారన్న అచ్చెన్న... భయపడకపోతే దాడి చేసిన నేతలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల భూములకు, ప్రాణాలకు రక్షణ లేదని, ఉపాధికి దిక్కులేదని అచ్చెన్న ఆరోపించారు. తక్షణమే దాడి చేసిన వైకాపా నేతలను శిక్షించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి: South Central Railway: దసరా ప్రయాణికుల కోసం.. నేడు, రేపు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.