విజయవాడ కరకట్ట వెంబడి రక్షణ గోడ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో తెదేపా నేతలు వినూత్న నిరసన చేపట్టారు. కృష్ణానది మధ్యలో నడుము లోతు ఇసుక గోతుల్లో దిగి.. తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. వరద బాధితులకు రూ.10వేలు తక్షణ సాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెదేపా అధికారంలో ఉండగా ఒక్క ఇల్లు తొలగించకుండా.. రెండున్నర కిలోమీటర్లు రక్షణ గోడ నిర్మాణం మొదటిదశ పూర్తి చేసిందని విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గుర్తు చేశారు. రెండోదశ నిర్మాణంలో మూడొంతుల ఇళ్లు తొలిగించేందుకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వటాన్ని తప్పుపట్టారు. ఒక్క ఇల్లు తొలగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇళ్లకు, గోడకూ మధ్య 70 అడుగుల స్థలం వదిలి.. పక్కన రోడ్డు నిర్మాణమూ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నరలో 8సార్లు వరద వచ్చినా.. బాధితులకు ప్రభుత్వం నామమాత్రపు పరిహారమూ ఇవ్వకపోవడాన్ని ఖండించారు.
ఇదీ చదవండి: వ్యక్తి అనుమానాస్పద మృతి... అంత్యక్రియలకు ముందుకురాని కుటుంబం...